News February 23, 2025

టాసుల్లో టీమ్ ఇండియా ఓటముల పరంపర

image

టీమ్ ఇండియా టాసుల ఓటముల పరంపర కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులోనూ టాస్ ఓడింది. రోహిత్ ‘హెడ్స్’ అనగానే కాయిన్ రివర్స్‌లో పడింది. దీంతో వన్డేల్లో వరుసగా 12వ మ్యాచులోనూ భారత్ టాస్ పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌(11 టాస్ ఓటములు)ను భారత్ అధిగమించింది. ఇండియన్ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు 12 సార్లు టాస్ గెలవలేకపోయింది.

Similar News

News November 11, 2025

పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

image

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.

News November 11, 2025

కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

image

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.

News November 11, 2025

బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

image

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103