News September 27, 2025

టీమ్ ఇండియా ‘సూపర్’ డామినేషన్

image

సూపర్ ఓవర్ <<17842529>>మ్యాచుల్లో<<>> టీమ్ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచులు టైగా ముగియగా ఐదు సార్లు సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అన్నింట్లోనూ భారత్‌‌దే విజయం. మరో మ్యాచులో బౌల్ ఔట్ నిర్వహించగా అందులోనూ విజేతగా నిలిచారు. 2022లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ టైగా ముగిసినప్పటికీ వర్షం కారణంగా కొనసాగలేదు. అటు శ్రీలంక 6 సార్లు సూపర్ ఓవర్‌కు వెళ్లగా నాలుగింట్లో పరాజయం పాలైంది.

Similar News

News February 8, 2026

SPMCILలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.50వేలు

image

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SPMCIL<<>>) 3 యంగ్ ప్రొఫెషనల్(సైబర్ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com

News February 8, 2026

తన పురుషాంగం, తల దాచాలని కోరాడు

image

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ గురించి పలు విచిత్ర విషయాలూ బయటకొస్తున్నాయి. అందులో ఒకటి.. Cryonics. పిలిచే నిరూపితం కాని ఈ సైన్స్ ప్రక్రియలో మృతదేహాన్ని -195° నుంచి -320° మధ్య ఫ్రీజ్ చేస్తారు. ఆ వ్యక్తికి గల రోగం/సమస్యకు ఫ్యూచర్‌లో సరైన పరిష్కారం దొరికినప్పుడు తిరిగి యాక్టివ్ చేసి చికిత్స చేస్తారు. దీన్ని బాగా నమ్మిన ఎప్‌స్టీన్ తన తల, పురుషాంగం ఫ్రీజ్ చేయాలని సైంటిస్టులకు సూచించాడట.

News February 8, 2026

T20 WC: ఇంగ్లండ్ స్కోర్ 184-7

image

ముంబై: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184-7 స్కోర్ చేసింది. జాకబ్ బెథెల్ (55), బ్రూక్ (53), విల్ జాక్స్ (39*) రాణించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. షేర్ మల్లా, సందీప్ లామిచానే తలో వికెట్ పడగొట్టారు. కరణ్ కేసీ వేసిన చివరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. నేపాల్ టార్గెట్ 20 ఓవర్లలో 185 రన్స్.