News January 10, 2025

టీమ్ ఇండియా టార్గెట్ 239 రన్స్

image

భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తీ శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.

Similar News

News January 10, 2025

తెలంగాణకు సం‘క్రాంతి’లేదా?

image

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు మెుండిచెయ్యి చూపింది. APకి వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు కేటాయించిన అధికారులు.. తెలంగాణకు మాత్రం ఒక్క రైలూ ప్రకటించలేదు. దీంతో బస్సుల్లో వెళ్లాలంటే రూ.వేలు వెచ్చించాల్సి వస్తుందని వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పండుగకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.

News January 10, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. హరీశ్ తన ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరోసారి విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్‌కు నోటీసులు జారీచేసింది.

News January 10, 2025

ఆదివాసీ నేతలతో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

image

TG: ఆదివాసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. తమ సమస్యల్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ‘ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను మంజూరు చేస్తున్నాం. బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తాం. కేస్లాపూర్ జాతరకు నిధుల మంజూరు చేస్తాం. ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం. ఉచితంగా బోర్లు వేస్తాం’ అని CM హామీ ఇచ్చారు.