News April 3, 2024

RCB లాంటి జట్లు ఎప్పటికీ కప్పు కొట్టలేవు: రాయుడు

image

ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘రూ.కోట్లు వెచ్చించి తీసుకున్న ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు గ్రౌండ్‌లో కంటే డగౌట్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇలా జరుగుతున్నంత కాలం ఆర్సీబీ రాత మారదు. అలాగే ఆ జట్టు బౌలర్లు ఎప్పుడూ అత్యధికంగా పరుగులు ఇస్తుంటారు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో ఒక్క స్టార్ ఆటగాడు కూడా రాణించడం నేను చూడలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్

image

TG: కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉ.11 గంటలకు సెక్రటేరియట్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. అటు సాయంత్రం 5 గంటలకు HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ‘తెలంగాణ రైజింగ్-2047’పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.

News November 25, 2025

రూ.10 కోట్లు చెల్లించాలని విశాల్‌కు హైకోర్టు ఆదేశం

image

హీరో విశాల్‌ను రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అగ్రిమెంట్‌ ఉల్లంఘించి తన సినిమాలను లైకా ప్రొడక్షన్స్‌కు కాకుండా వేరే సంస్థకు విక్రయించినట్టు పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన కోర్టు రూ.21 కోట్లు 30% వడ్డీతో లైకాకు చెల్లించాలని తీర్పునిచ్చింది. విశాల్ దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.