News February 10, 2025
రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ కన్నీళ్లే: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద RMP, PMPల ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మడం లేదని రాహుల్ గాంధీతో బాండ్ పేపర్లు రాయించారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ అమలు కావడం లేదు. 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్ సాధించిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News December 1, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయం కిక్కిరిసింది.
News December 1, 2025
చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 1, 2025
ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.


