News March 1, 2025

విడాకులు దొరకవనే భయంతో టెకీ ఆత్మహత్య?

image

మానవ్‌శర్మ మృతికి విడాకుల భయమే కారణమని మృతుడి సోదరి తెలిపింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత విడిపోదామనుకున్నాడంది. అయితే అదంత సులువు కాదని, చట్టాలన్నీ మహిళల వైపే ఉంటాయని భార్య నికిత బెదిరించేదని చెప్పింది. ఫిబ్రవరి 23న కూడా లీగల్ ప్రొసీడింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, మానవ్‌ను ఆగ్రా తీసుకొచ్చి మరోసారి బెదిరించిందని తెలిపింది. భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది.

Similar News

News November 13, 2025

పంట ఉత్పత్తుల సేకరణ నిబంధనలు సడలించాలి: తుమ్మల

image

TG: వర్షాల ప్రభావం పడిన సోయాబీన్, మొక్కజొన్న, పత్తి సేకరణ నిబంధనలు సడలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. పంట ఉత్పత్తులు సేకరించేలా NAFED, NCCFలను ఆదేశించాలన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే సేకరించాలన్న CCI ప్రతిపాదనతో రైతులు నష్టపోతారని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. L1, L2, స్పాట్ బుకింగ్‌లతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

News November 13, 2025

విశాఖలో 99పైసలకే రహేజాకు 27.10 ఎకరాలు

image

AP: VSP IT సెక్టార్లో 27.10 ఎకరాలు కేవలం 99 పైసలకే ‘రహేజా’కు ఇస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. అదనంగా ఆర్థిక రాయితీలు ఇస్తామంది. పైగా ₹91.20CRతో రోడ్లు, నీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తామంది. కాగా ₹2172.26 CRతో ఐటీ, రెసిడెన్షియల్ స్పేస్ నిర్మిస్తామని, 9681 జాబ్‌లు కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. ₹కోట్ల విలువైన భూమిని సదుపాయాలు కల్పించి మరీ 99 పైసలకే ‘రియల్’ సంస్థకు ఇవ్వడంపై అనేక ప్రశ్నలొస్తున్నాయి.

News November 13, 2025

రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

image

గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డైటీషియన్ల సలహాతో అథ్లెట్లు, బాడీబిల్డర్లు 3-4 గుడ్లు తినొచ్చు. గుండె జబ్బులు, అధిక ఎల్‌డీఎల్, డయాబెటీస్ ఉన్నవాళ్లు, ఆహారంలో సంతృప్త కొవ్వులు తీసుకునేవారు గుడ్లు అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.