News May 19, 2024

సాంకేతిక లోపం.. అకౌంట్లో ₹9,999 కోట్లు

image

బ్యాంక్ తప్పిదం వల్ల ఓ వ్యక్తి ఖాతాలో ఏకంగా ₹9,999 కోట్లు దర్శనమిచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో భాను ప్రకాశ్ అనే వ్యక్తికి బరోడా యూపీ బ్యాంక్‌లో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అతడు బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఒక్కసారిగా ₹99,99,94,95,999.99 దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అకౌంట్ NPAగా మారి సాంకేతిక లోపంతో అంత మొత్తం చూపించిందని వివరించారు.

Similar News

News December 19, 2025

‘3 ఇడియట్స్’ సీక్వెల్ టైటిల్ ఏంటంటే?

image

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించనున్న ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌కు టైటిల్ ‘4 ఇడియట్స్’ అనుకుంటున్నారని తెలుస్తోంది. తొలి పార్టులో నటించిన ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషితో పాటు మరో సూపర్ స్టార్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ మూవీ 3 ఇడియట్స్ కంటే భారీగా ఉండనుందని వెల్లడించింది. నాలుగో క్యారెక్టర్‌కు న్యాయం చేసేలా కొన్ని కొత్త అంశాలు ఉంటాయని పేర్కొంది.

News December 19, 2025

18 లక్షల మందితో YCP సైన్యం: సజ్జల

image

AP: పార్టీ సంస్థాగత నిర్మాణానికి 35 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నామని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతలతో భేటీలో తెలిపారు. ‘గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభ్యులందరి డేటాను డిజిటలైజ్ చేస్తాం. అంతా పూర్తయితే 16 నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతుంది. జగన్ మంచి పాలన అందించారు. ఏం కోల్పోయారో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. ఆటుపోట్లెన్ని ఉన్నా నిరంతర పోరాటమే లక్ష్యమన్నారు.

News December 19, 2025

ఇంటర్ పరీక్షల్లో మార్పులు

image

ఏపీ ఇంటర్ బోర్డు రెండు పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. మ్యాథ్స్ పేపర్ 2A, సివిక్స్ పేపర్ 2లను మార్చి 4న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 3) నిర్వహిస్తామని ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్1, లాజిక్ పేపర్1 మార్చి 21న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 20) ఉంటాయని తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.