News December 18, 2024
కేంద్ర మంత్రి విమానంలో సాంకేతిక లోపం

AP: నేడు విశాఖలో జరగాల్సిన ‘ఐఎన్ఎస్ నిర్దేశక్’ నౌక జాతికి అంకితం కార్యక్రమం మధ్యాహ్నానికి వాయిదా పడింది. కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ ఉదయం విశాఖ చేరుకోవాల్సి ఉండగా, ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం హైదరాబాద్కు మళ్లించారు. కేంద్ర మంత్రి మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్నారు.
Similar News
News December 2, 2025
రాష్ట్రంలో శామీర్పేట్ PSకు ఫస్ట్ ప్లేస్

TG: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మేడ్చల్(D) శామీర్పేట్ PS 7వ స్థానం, రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ సాధించింది. PS పని తీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో వ్యవహరించే తీరు తదితర అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలూ పరిశీలించింది. ఏటా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను MHA ఎంపిక చేస్తుంది.
News December 2, 2025
నేడు, రేపు, ఎల్లుండి.. నాన్ వెజ్ వద్దు: పండితులు

నేటి నుంచి వరుసగా మూడ్రోజుల పాటు మద్యమాంసాలు మానుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ‘నేడు శివపార్వతుల ఆరాధనకు పవిత్రమైన ప్రదోషం ఉంది. రేపు సకల కార్యసిద్ధిని కలిగించే హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఎల్లుండి పౌర్ణమి తిథి. దత్త జయంతి పర్వదినం. ఈ 3 రోజులు పూజలు, వ్రతాలకు విశిష్టమైనవి. కాబట్టి ఈ శుభ దినాలలో మద్యమాంసాలను మానేస్తే.. ఆయా వ్రతాల అనుగ్రహాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు’ అని అంటున్నారు.
News December 2, 2025
తిరుమల తరహాలో అన్ని చోట్లా..: సింఘాల్

AP: తిరుమల తరహాలో TTD పరిధిలోని ఆలయాల్లో రుచికరంగా అన్నప్రసాదాలు అందజేస్తామని TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. TTDలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలోని వేంకటేశ్వరుడి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


