News February 5, 2025

తీన్మార్ మల్లన్నపై వేటు?

image

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, ఇతర అంశాల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. ఇవాళ ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.

Similar News

News December 7, 2025

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు ఇలా…!

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరల వివరాలను వ్యాపారులు ప్రకటించారు. కిలో పొట్టేలు మటన్ ధర రూ. 800గా ఉంది. కిలో చికెన్ ధర రూ. 260 చొప్పున విక్రయిస్తుండగా, లైవ్ కోడి కిలో రూ. 160 పలుకుతోంది. గత వారంతో పోలిస్తే, చికెన్ ధర కిలోకు రూ. 10 పెరిగింది. అయితే, మటన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పెరిగిన చికెన్ ధరతో మాంసాహార ప్రియులు కొంత నిరాశ చెందారు.

News December 7, 2025

రోహిత్, కోహ్లీలకు గంభీర్ షాక్!

image

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో రాణించినప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. విరాట్, రోహిత్ శర్మలు 2027 WC ఆడటంపై గ్యారంటీ ఇవ్వలేదు. వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారా అని జర్నలిస్టులు అడగ్గా.. ‘వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లు ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్లు చక్కగా ఆడుతూ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.

News December 7, 2025

విత్తన మొలక శాతం.. పంట దిగుబడికి ముఖ్యం

image

పంట దిగుబడి బాగుండాలన్నా, వ్యవసాయం లాభసాటిగా సాగాలన్నా పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత దాని మొలక శాతాన్ని పరిశీలించాలి. అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అసలు విత్తన మొలక శాతాన్ని ఎలా పరిశీలించాలి? దానికి అందుబాటులో ఉన్న పద్ధతులు ఏమిటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.