News February 22, 2025
ఆగస్టు 1న తేజా సజ్జ ‘మిరాయ్’ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్పై భారీ అంచనాలున్నాయి.
Similar News
News December 5, 2025
గొల్లపల్లి నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎస్పీ

గొల్లపల్లి పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి గురువారం సందర్శించారు. నామినేషన్ ప్రక్రియను సమీక్షించారు. అభ్యర్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండాలని సూచించారు. స్థానిక పోలీసు సిబ్బందితో మాట్లాడి నిఘా మరింత పెంచాలన్నారు. అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి ఉన్నారు.
News December 5, 2025
నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.


