News September 26, 2025

MiG-21 స్థానాన్ని భర్తీ చేస్తున్న ‘తేజస్’

image

భారత తొలి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్ MiG-21కు IAF <<17834345>>వీడ్కోలు<<>> పలికింది. వీటి స్థానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఫైటర్ జెట్స్ క్రమంగా భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి పలు స్క్వాడ్రన్లలో సేవలందిస్తున్నాయి. వచ్చే నెల అడ్వాన్స్‌డ్ వెర్షన్ ‘తేజస్ Mk1A’ను HAL లాంచ్ చేయనుంది. ఎయిర్-ఎయిర్, ఎయిర్-సర్ఫేస్ వంటి మల్టీ మిషన్ క్యాపబిలిటీస్ వీటి సొంతం. స్వయం సమృద్ధే లక్ష్యంగా ఆర్మీ ముందుకు సాగుతోంది.

Similar News

News February 7, 2026

సడన్‌గా తగ్గిన రష్యా చమురు దిగుమతులు!

image

2025లో భారత్‌కు రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. జూన్‌లో రోజుకు 20లక్షల బ్యారెళ్ల వద్ద టాప్ లెవల్‌కు చేరుకోగా.. నవంబర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. US ఆంక్షలు, ట్రేడ్ రూల్స్ మారడంతో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయాయి. ఒకప్పుడు 44% షేర్ ఉన్న రష్యా ఆయిల్ జనవరి నాటికి 22%కి పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లకు పరిమితమైనా ఇప్పటికీ రష్యా కీలక సప్లయర్‌గానే ఉంది.

News February 7, 2026

ఒక్క ప్రమాదం.. ముమైత్ జీవితం తలకిందులు!

image

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తాను HYDలో మేకప్&హెయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు 30 ఏళ్లున్నప్పుడు ఇంట్లో జారిపడడంతో తలకు గాయమైంది. మెదడు నరాలు దెబ్బతిన్నాయి. 15రోజులు కోమాలో ఉన్నా. ఏడేళ్లు మంచానికే పరిమితమయ్యా. ఆ సమయంలో మా అమ్మే నన్ను చూసుకుంది’ అని తెలిపారు.

News February 7, 2026

గులాబీ తోటల్లో కనిపించే చీడపీడలు

image

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్‌ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.