News March 18, 2024
టెక్కలి: ఎన్నికల కోడ్ అమలపై అధికారులకు సూచనలు

టెక్కలిలో సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సామున్ పర్యటించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెవెన్యూ అధికారులు, పోలీసులతో సమీక్షించిన ఆయన ఎన్నికల కోడ్ అమలుపై అధికారులకు సూచనలు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈయనతో పాటు టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్, జిల్లా పోలీసు అధికారులున్నారు.
Similar News
News December 21, 2025
సోంపేట: చెరువులను కాపాడాలని కలెక్టర్కు ఫిర్యాదు

సోంపేట పట్టణంలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు జడ్పీటీసీ సభ్యురాలు యశోద శనివారం వినతి ఇచ్చారు. దీనిపై విచారణ చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూ అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాసపురం సర్పంచ్ టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు.
News December 21, 2025
విశేష స్పందనతో జనవరి 3 వరకు సైకిల్ యాత్ర: SP

ప్రజల్లో విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయడం జరిగిందని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 వరకు కొనసాగుతుందని ఆయన తెలియజేసారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పూర్తిగా నియంత్రణకు అభ్యుదయ సైకిల్ ఉపయోగపడుతుందని అన్నారు.