News August 24, 2025

లైఫ్ సైన్సెస్‌కు తెలంగాణ కేంద్రం: సీఎం

image

TG: బ‌యోడిజైన్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్‌లో CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడు గొప్ప డిజైనర్. ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థుల‌మా కాదా అన్న‌దే ప్ర‌శ్న‌. తెలంగాణ‌ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించాం. అప్పటి వరకు రాష్ట్రాన్ని $3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారుస్తాం. లైఫ్ సైన్సెస్‌కు రాష్ట్రం కేంద్రంగా ఉంది. ఆవిష్కరణలు చేయడానికి TG స‌రైన వేదిక’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News August 25, 2025

దక్షిణాఫ్రికా పేరిటే ఆ రికార్డు

image

వన్డేల్లో అత్యధిక సార్లు 400+ రన్స్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా(8) పేరిట రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో టీమ్ ఇండియా(7), ఇంగ్లండ్(6), <<17503678>>ఆస్ట్రేలియా<<>>(3), NZ(2), SL(2), జింబాబ్వే(1) ఉన్నాయి. చిత్రమేమిటంటే వెస్టిండీస్, PAK, బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఈ మార్క్ అందుకోలేకపోయాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సిరీస్‌లు(సిరీస్‌లో కనీసం 3 వన్డేలు) గెలిచిన జట్టుగా సౌతాఫ్రికా(9) రికార్డు నెలకొల్పింది.

News August 25, 2025

కొత్త రేషన్ కార్డులు.. నేటి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ

image

AP: నేటి నుంచి దశల వారీగా <<17506953>>కొత్త రేషన్<<>> కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రేషన్ పంపిణీలో లబ్ధిదారులకు పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలను అందించేందుకు క్యూఆర్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ఇవ్వనుంది. తొలి విడతలో ఇవాళ్టి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. రెండో విడతలో ఈ నెల 30 నుంచి మరో నాలుగు జిల్లాల్లో, మూడో విడతలో సెప్టెంబర్ 6 నుంచి ఐదు జిల్లాల్లో, 15 నుంచి 8 జిల్లాల్లో ఇవ్వనున్నారు.

News August 25, 2025

‘వినాయక చవితి’ ట్రెండ్ మారింది

image

గణేశ్ నిమజ్జనం రోజు చూసే వేడుకలు ఇప్పుడు వినాయకుడి ఆగమనం రోజున కనిపిస్తున్నాయి. విగ్రహాలను కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొస్తున్న సమయంలోనూ యువత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజే మ్యూజిక్, ఫైర్ వర్క్స్, రంగులు చల్లుకుంటూ బొజ్జ గణపయ్యకు ఆహ్వానం పలుకుతున్నారు. నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ గ్రామాలకు విస్తరిస్తోంది. ఏమైనప్పటికీ విద్యుత్ వైర్ల కింద నుంచి, రహదారులపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.