News May 28, 2024

పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిపాలన: KTR

image

తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని KTR ధ్వజమెత్తారు. ‘కళాకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన రాజముద్రలోని ‘కాకతీయ తోరణం, చార్మినార్’ రాచరిక పోకడలన్న CM రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్ర గీతంలో ‘గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అని ఆలపిస్తున్నాం కదా అని ప్రశ్నించారు. CM, కేబినెట్‌లో ఎవరికైనా ఆ పాటలో ఏమున్నదో తెలుసా?’ అని సెటైర్లు వేశారు.

Similar News

News January 22, 2025

గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ట్రంప్ గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చగలరా?

image

తీరప్రాంతాల పేర్లు మార్చేందుకు అధికారికంగా అంతర్జాతీయ ఒప్పందాలేమీ లేవు. ఈ వివాదాల పరిష్కారం, సయోధ్యకు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ (IHO) ప్రయత్నిస్తుంది. ట్రంప్ కోరుకుంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను US పత్రాల్లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చుకోవచ్చు. EX బ్రహ్మపుత్రను చైనాలో సాంగ్‌పో, యార్లంగ్ జంగ్‌బోగా పిలుస్తారు. తమను వేరుచేసే జలసంధిని పర్షియన్ గల్ఫ్‌గా ఇరాన్, అరేబియన్ గల్ఫ్‌గా సౌదీ పిలుస్తాయి.

News January 22, 2025

తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు

image

దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

News January 22, 2025

మహా కుంభమేళాకు వెళ్తున్నారా?

image

‘మహా కుంభమేళా’కు వెళ్లి వచ్చిన వారి అభిప్రాయాలు మీకోసం. ‘ట్రైన్‌లో వెళ్తే స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు అరగంట పడుతుంది. టాక్సీలు దొరకవు. సిటీ అంతా ట్రాఫిక్. ఆన్‌లైన్ కంటే క్యాష్ తీసుకెళ్లండి. ఆన్‌లైన్‌లోనే టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. రూ.5వేలు చెల్లిస్తే బోట్‌లో వెళ్లి స్నానం చేసి రావొచ్చు. నాగ సాధువుల ఆశీర్వాదం కోసం సగం రోజు కేటాయించండి’ అని సూచించారు. అధికారిక కాటేజీల నంబర్లను పై ఫొటోలో చూడొచ్చు.