News June 7, 2024
ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి
TG: వరి ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరి ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పన తమ లక్ష్యమని, అందుకోసం కలిసిగట్టుగా కృషి చేస్తున్నామని చెప్పారు.
Similar News
News November 29, 2024
తెలుగు టైటాన్స్ విజయం
ప్రో కబడ్డీ లీగ్లో యూ ముంబాతో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 41-35 పాయింట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. TTలో ఆశిష్, విజయ్ చెరో 10 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్(48) రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో హరియాణా స్టీలర్స్(56) కొనసాగుతోంది.
News November 29, 2024
నిద్ర రాకముందే బెడ్రూంలోకి వెళ్తున్నారా?
చాలామంది నిద్రరాకముందే బెడ్రూంలోకి వెళ్లి బలవంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే ఒత్తిడి పెరిగి నిద్ర రావడం మరింత ఆలస్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే నిద్ర వచ్చే వరకు న్యూస్ పేపర్, బుక్స్ చదవడం చేయాలంటున్నారు. నిద్ర వచ్చినప్పుడే బెడ్రూంలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. త్వరగా నిద్రపట్టేందుకు సా.4 తర్వాత టీ, కాఫీ దూరంపెట్టాలంటున్నారు. డైలీ అరటిపండ్లు తినాలని చెబుతున్నారు.
News November 29, 2024
16 ఏళ్లలోపు పిల్లలకు ఇవి నిషేధం.. చట్టాన్ని ఆమోదించిన ఆస్ట్రేలియా
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ తెచ్చిన చట్టాన్ని ఆస్ట్రేలియా గురువారం ఆమోదించింది. అన్ని టెక్ దిగ్గజాలను దీని పరిధిలోకి తెచ్చింది. ఇన్స్టాగ్రామ్, మెటా, టిక్టాక్ వంటి సంస్థలు ఇక నుంచి మైనర్ల లాగిన్ను నిలిపివేయాలి. లేదంటే రూ.410 కోట్ల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని జనవరిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఏడాది కాలంలో పూర్తిస్థాయిలో అమలు చేస్తారు.