News August 30, 2025

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

image

TG: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు సభ మొదలవనుంది. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు అనుమతించనుంది. అయితే దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News August 30, 2025

టెన్త్ అర్హతతో 1,266 ఉద్యోగాలు..

image

ఇండియన్ నేవీలో 1,266 స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 2 వరకు అవకాశం ఉంది. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. 18-25 ఏళ్ల మధ్య వయసుండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. పూర్తి సమాచారం కోసం <>https://indiannavy.gov.in/<<>>ను సందర్శించవచ్చు.

News August 30, 2025

BSFలో 1,121 ఉద్యోగాలు.. SEP 23 లాస్ట్ డేట్

image

BSFలో 1,121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్/మెకానిక్) పోస్టులకు సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, రెండేళ్ల ITI లేదా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 60% మార్కులున్న వారు అర్హులు. వయసు జనరల్ అభ్యర్థులకు 18-25, OBC 18-28, SC, STలకు 18-30 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, CBT టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం: ₹25,500-81,100.
వెబ్‌సైట్: <>www.bsf.gov.in<<>>

News August 30, 2025

డిగ్రీ అర్హతతో ఐబీలో 394 జాబ్స్

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు <>www.mha.gov.in<<>> వెబ్‌సైటును సంప్రదించగలరు.