News July 23, 2024
ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు మొదలైన విషయం తెలిసిందే. ఇవే 8రోజుల పాటు జరుగుతాయి. కాగా ఎల్లుండి ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
Similar News
News March 26, 2026
సబ్సిటీ రుణాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

ఎస్సీ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రూ.లక్ష లోపు రుణాలపై 90% సబ్సిడీ, రూ.3లక్షల లోపు రుణాలకు 70 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల లోపు రుణాలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
News March 26, 2026
ఇరాన్ దెబ్బ.. హోటళ్లకు మారిన అమెరికన్ దళాలు

గల్ఫ్ రీజియన్‌లోని తమ స్థావరాలపై ఇరాన్ దాడులతో US దళాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సైనికులంతా వాటిని ఖాళీ చేసి హోటళ్లు, ఆఫీసులకు మారినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీన్నిబట్టి ట్రంప్ సన్నాహాలు లేకుండానే యుద్ధంలోకి దిగినట్లు అర్థమవుతోందని ఓ అధికారి పేర్కొన్నట్లు తెలిపింది. మరోవైపు US జవాన్ల ఆచూకీ తెలపాలంటూ ప్రజలను IRGC కోరుతోంది. వాళ్లు పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది.
News March 26, 2026
చిరు, నాగబాబును అన్నయ్య అనే పిలుస్తా: అన్నా కొణిదెల

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు అన్నదమ్ములు లేరని, కానీ పెళ్లై కొణిదెల ఫ్యామిలీలోకి వచ్చాక చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం భర్త నుంచి అలవాటైందని పేర్కొన్నారు. వరుసల పరంగా పిలుపులు వేరైనా.. మనసుతో వారిని తన సొంత సోదరులుగానే భావిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు. మెగా బ్రదర్స్‌పై ఆమె చూపిన ఈ అనురాగం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.


