News October 11, 2025

ఈ నెల 14న తెలంగాణ బంద్: R.కృష్ణయ్య

image

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్‌కు సీఎం రేవంత్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇవ్వడం దుర్మార్గమని, మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్తామని నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

Similar News

News October 11, 2025

‘RARE’ invitation: ఖనిజ తవ్వకాలకు అఫ్గాన్‌ ఆహ్వానం!

image

‘rare earth minerals’.. పేరుకు తగ్గట్లే అత్యంత అరుదైన ఖనిజాలివి. వీటి కోసమే అమెరికా, పాశ్చాత్య దేశాలు పాక్‌తో అంటకాగుతున్నాయి. ఈ క్రమంలో $1 ట్రిలియన్‌‌కు పైగా విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న అఫ్గాన్‌ ఇండియా వైపు చూస్తోంది. మినరల్స్, ఎనర్జీ సెక్టార్‌లో తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. లిథియం, ఐరన్ ఓర్, కాపర్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అఫ్గాన్ మైన్లలో దొరుకుతున్నాయి.

News October 11, 2025

‘RARE’ invitation: చైనా, అమెరికాకు చెక్ పెట్టొచ్చు!

image

డిఫెన్స్, ఎనర్జీ సెక్టార్‌లో రేర్ ఎర్త్ మినరల్స్ అత్యంత కీలకం. ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల తయారీ, టెక్నాలజీ, ఆర్మీ అవసరాలకు ఉపయోగిస్తారు. అయితే జాతీయ భద్రత పేరుతో చైనా తమ రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. మరోవైపు ఖనిజాల సరఫరాపై అమెరికాతో పాక్ $500M ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో అఫ్గాన్ ఇచ్చిన ఛాన్స్‌ను ఇండియా వినియోగించుకుంటే అటు అమెరికాకు, ఇటు చైనాకు ఒకేసారి చెక్ పెట్టవచ్చు.

News October 11, 2025

గుడ్ ఐడియా.. పూల అమ్మకానికి సోషల్ మీడియా

image

పంట దిగుబడి బాగున్నా.. కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతుంటారు. దీనికి పరిష్కారంగా పంట అమ్మకానికి కొందరు రైతులు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. పూలు తెంపే 2,3 రోజుల ముందే ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పోస్టు చేస్తున్నారు. ఇది చూసి ఊరి జనం, చుట్టుపక్కల గ్రామాలవారు నేరుగా ఈ రైతులను సంప్రదించి.. తోటల నుంచే తాజా పూలను కొంటున్నారు. మిగిలిన వాటిని పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు.