News March 7, 2025

12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

image

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించనున్నారు.

Similar News

News March 13, 2026

మొజ్తబా ఓ కీలుబొమ్మ: నెతన్యాహు

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని ఇజ్రాయెల్ PM నెతన్యాహు విమర్శించారు. ఆయన రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మ అని, బయటకు కూడా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మరణించారని తెలిపారు. ‘ఇరాన్ ప్రజలు స్వేచ్ఛా మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది. మేం వారికి అండగా ఉంటాం. కానీ మార్పు మాత్రం వారి చేతుల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.

News March 13, 2026

ధోనీ ఆ స్థానాల్లో బ్యాటింగ్‌‌ చేయడం కరెక్ట్ కాదు: పుజారా

image

CSK మాజీ కెప్టెన్ ధోనీ 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌‌కు రావడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ పుజారా అన్నారు. ‘ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు. కేవలం 5 లేదా10 కాకుండా 25-30 బంతులు ఆడితే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ముందుగా బ్యాటింగ్‌కు వస్తే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు. 44 ఏళ్ల ధోనీ గత సీజన్‌లో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.

News March 13, 2026

వారు రక్తదానం చేయడంపై నిషేధం కొనసాగుతుంది: కేంద్రం

image

ట్రాన్స్‌జెండర్లు, పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులు, సెక్స్ వర్కర్ల రక్తదానంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. HIV, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిబంధనలు అవసరమని తెలిపింది. ఇది వివక్ష కాదని స్పష్టం చేసింది. కేవలం లైంగిక గుర్తింపు ఆధారంగా రక్తదానాన్ని నిరాకరించడం చట్టవిరుద్ధమని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కేంద్రం వివరణ ఇచ్చింది.