News March 1, 2025

6న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులపై చర్చించనుంది. వీటిని ఆమోదించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. అనంతరం వాటిని పార్లమెంటుకు పంపి చట్టం చేయాలని కేంద్రాన్ని కోరనుంది. ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 1, 2025

అక్కా.. అని పిలిచి అత్యాచారం

image

పుణే రేప్ కేసు <<15605696>>నిందితుడు<<>> దత్తాత్రేయ గడేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే ఘటన జరిగిన రోజు తె.జామున యువతి స్వార్గేట్ బస్టాండ్‌లో నిల్చొని ఉండగా గడే ఇన్‌షర్ట్ వేసుకొని వచ్చాడు. ‘దీదీ(అక్కా) మీ బస్సు పక్కన నిలిపి ఉంది’ అని తీసుకెళ్లాడు. బస్సులో లైట్లు ఆన్ చేయలేదేంటని ఆమె ప్రశ్నించగా ప్రయాణికులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. ఆమె అందులోకి ఎక్కగానే డోర్ లాక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

News March 1, 2025

ఆఫీసులో ఎన్ని గంటలు ఉన్నారన్నది ముఖ్యమే కాదు: ఆకాశ్ అంబానీ

image

ఆఫీసులో రోజూ ఎన్ని గంటలు గడిపామన్నది కాదు ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ముంబై టెక్ వీక్‌ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ‘ఎన్ని గంటలు, ఎంత టైమ్ ఉన్నారని నేను ఆలోచించను. రోజూ ఎంత క్వాలిటీ వర్క్ చేశారన్నదే ముఖ్యం. Growth is Life అన్నదే రిలయన్స్ మోటో. ఇది వ్యక్తిగత జీవితానికీ వర్తిస్తుంది. అంటే మనం ప్రతిరోజూ ఎదుగుతూనే ఉండాలి’ అని పేర్కొన్నారు.

News March 1, 2025

ట్రంప్‌కు క్షమాపణ చెప్పను: జెలెన్‌స్కీ

image

ఓవెల్ ఆఫీస్ ఘటనపై ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని అనుకోవటం లేదని, అయితే అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తానని ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని కోరారు. ఉక్రెయిన్‌లోని ఖనిజాల తవ్వకం ఒప్పందంపై భేటీలో USనుంచి రక్షణ కావాలని జెలెన్‌స్కీ ఒత్తిడి చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!