News April 24, 2024

తెలంగాణ పరువు తీశారు: కేసీఆర్

image

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అధికారులను మార్చిందని దుయ్యబట్టారు.

Similar News

News March 6, 2026

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

image

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం 14దేశాలకు విస్తరించింది. ఇరాక్, కువైట్, UAE, బహ్రెయిన్, ఖతర్, జోర్డాన్, అజర్‌బైజాన్, ఒమన్, సౌదీ, లెబనాన్, సైప్రస్ వీటిలో ఉన్నాయి. దీంతో ఇప్పట్లో వార్ ముగిసేలా కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇరాన్‌కు అండగా నిలుస్తున్న రష్యా, చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది.

News March 6, 2026

23న నక్కపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లిలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23వ తేదీ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో భూమిపూజ చేయనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడించారు. రూ.1.5లక్షల కోట్ల అంచనాతో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, తొలి విడతలో రూ.80వేల కోట్లతో పనులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.

News March 6, 2026

యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

image

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.