News August 15, 2025

తెలంగాణ డీజీపీ జితేందర్ తల్లి కన్నుమూత

image

తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణ గోయల్ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల రాజకీయ నేతలు, పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 15, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. అటు, కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సా.5 గంటలకు 2,98,209 క్యూసెక్కులుగా ఉందని వెల్లడించింది.

News August 15, 2025

డ్రైవర్లు, కండక్టర్లను గౌరవించాలి: సీఎం

image

AP: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను గౌరవించాలని సీఎం చంద్రబాబు మహిళలకు సూచించారు. ‘మహిళలు ఓపిగ్గా ఉండాలి. డ్రైవర్లు, కండక్టర్లను గౌరవిస్తేనే ప్రయాణం సజావుగా సాగుతుంది. ఏం చేసినా వెనక్కి లాగేందుకు చాలా మంది చూస్తున్నారు. అమరావతి శ్మశానం అన్నారు. ఎడారి అన్నారు. కానీ దాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అని ఉచిత ప్రయాణ ప్రారంభోత్సవంలో సీఎం తెలిపారు.

News August 15, 2025

‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ హిట్: సీఎం చంద్రబాబు

image

AP: ‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ హిట్ అయ్యాయని CM చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభోత్సవంలో తెలిపారు. ‘RTC కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకుంది మేమే. త్వరలోనే వారికి డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తాం. 11,449 బస్సుల్లో 8,450 బస్సులను ఈ స్కీమ్‌కు కేటాయించాం. మహిళలు ఫ్రీగా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు’ అని పేర్కొన్నారు.