News March 29, 2024

పాటలు, డాన్సులు, ధర్నాల వల్ల తెలంగాణ రాలేదు: KK

image

తెలంగాణ ఏర్పాటుపై బీఆర్ఎస్‌ సీనియర్ నేత కె.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు పాటలు పాడినందుకో, డాన్సులు చేస్తేనో, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ వల్లో రాలేదని అన్నారు. బిల్లు పాస్ చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. అయితే ఉద్యమ స్ఫూర్తినిచ్చాయని అన్నారు. పార్లమెంటులో కొట్లాడింది మాత్రం కాంగ్రెస్ ఎంపీలేనని ఆయన చెప్పుకొచ్చారు.

Similar News

News December 4, 2025

రూపాయి.. ఇంకా కిందికి?

image

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ₹90ని క్రాస్ చేసింది. 2026 చివరి నాటికి ₹91.5కి చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. FIIలు తిరిగి ఇండియన్ మార్కెట్‌లో కొనుగోళ్లు చేపడితే డాలర్‌కు డిమాండ్ తగ్గి రూపాయి విలువ స్టెబిలైజ్ అవుతుందంటున్నారు. FIIల అమ్మకాలు కొనసాగితే మరింత <<18457079>>క్షీణిస్తుందని<<>> పేర్కొంటున్నారు. చమురు ధరలు పెరిగినా, భారత్-US మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనా రూపీ పడిపోతుందని చెబుతున్నారు.

News December 4, 2025

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఫేక్: పోలీసులు

image

TG: డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100% వరకు తగ్గింపు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని హైదరాబాద్ సిటీ పోలీసులు Xలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని తెలిపారు. అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ఎల్లప్పుడూ పోలీస్ హ్యాండిల్స్‌ను చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా పలు రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో ఈ ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.

News December 4, 2025

జుట్టు త్వరగా పెరగాలంటే ఇవి తినండి

image

ప్రస్తుతకాలంలో పోషకాహార లోపంతో జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఆకుకూర‌లు, నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, చేప‌లు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే క్యాల్షియం, ఐర‌న్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, విట‌మిన్ డి జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తాయంటున్నారు. అలాగే దాల్చిన చెక్క‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు పెరుగుద‌ల‌కు ఎంతో దోహదం చేస్తుందని చెబుతున్నారు.