News April 28, 2024
రేపు తెలంగాణ EAPCET హాల్‌టికెట్లు
తెలంగాణ EAPCET హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. ఇంజినీరింగ్‌కు 2.5 లక్షలు, అగ్రికల్చర్, ఫార్మాకు 98 వేల మంది అప్లై చేశారు. మే 7, 8 న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. రూ.5000 ఫైన్‌తో మే 1 వరకు EAPCETకు దరఖాస్తు చేయవచ్చు.
Similar News
News January 3, 2025
సంక్రాంతికి ట్రావెల్స్ సంస్థల దోపిడీ
సంక్రాంతికి ఊళ్లు వెళ్లేవారిని ట్రావెల్స్ సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. రైలు టికెట్లు నెలల ముందే నిండిపోవడం, ఆర్టీసీలోనూ ఖాళీలు లేకపోవడంతో ప్రయాణికులకు వేరే దారి లేని సందర్భాన్ని వాడుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టికెట్ ధర రూ.6వేలు ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీని ప్రభుత్వాలు అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News January 3, 2025
IND vs AUS 5వ టెస్ట్.. ఇరు జట్లు ఇవే!
టీమ్ ఇండియా: యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(w), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(C), ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(C), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలండ్.
News January 3, 2025
SHOCKING: జట్టు నుంచి రోహిత్ ఔట్!
సిడ్నీ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రచారంలో ఉన్నట్లుగా రోహిత్ శర్మ తుది జట్టు నుంచి తప్పుకొన్నారు. ఆయనకు బదులు కెప్టెన్‌గా బుమ్రా టాస్కు వచ్చారు. రోహిత్ స్వచ్ఛందంగా రెస్ట్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక తుది జట్టులో రోహిత్ స్థానంలో గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు మార్ష్ స్థానంలో వెబ్‌స్టెర్ డెబ్యూ కానున్నారు.