News May 20, 2024
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే. Way2News యాప్‌లో రీఫ్రెష్ చేసిన అనంతరం కనిపించే స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. సులభంగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 28, 2025
వనపర్తి: పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ నంబర్

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08545-233525కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలియజేశారు.
News November 28, 2025
కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్‌ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్‌ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.
News November 28, 2025
బతుకమ్మ కుంటపై HCకు హాజరవుతా: రంగనాథ్

TG: బతుకమ్మ కుంట వివాదంలో DEC 5వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైడ్రా రంగనాథ్‌ను HC ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నాపై ఇప్పటికే 30కి పైగా కేసులున్నాయి. కబ్జాదారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. లీగల్‌గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెరువులను అభివృద్ధి చేస్తాం. బతుకమ్మ కుంటపై కోర్టుకు హాజరై అన్ని విషయాలు వివరిస్తాం’ అని చెప్పారు.


