News January 1, 2025
తెలంగాణ రైతులకు సర్కారు తీపి కబురు

TG: రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయిల్ పామ్ గెలల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధరను రూ.20,506గా నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపారు. ఏడాది పాలనలో తమ ప్రభుత్వం రూ.21వేల కోట్ల రుణమాఫీ, రూ.7625 వేల కోట్ల రైతుబంధు, రూ.3వేల కోట్ల రైతు బీమా ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Similar News
News December 5, 2025
అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తున్నాయా?

అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడాన్ని హిర్సుటిజం అంటారు. ముందు దీనికి చికిత్స తీసుకుని ఆ తర్వాత వెంట్రుకల పెరుగుదలను ఆపడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. వెంట్రుకలు తొలగించడానికి పర్మనెంట్ హెయిర్ లేజర్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. అయితే హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి ఎక్కువ సెషన్లు తీసుకోవాల్సి వస్తుంది. మూల కారణాన్ని తెలుసుకుంటే సెషన్ల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
News December 5, 2025
మరో సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

వికల్ప్ పేరుతో మావోయిస్టులు మరో సంచలన లేఖ విడుదల చేశారు. దేవ్జీ సహా మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. లొంగిపోవడానికి వాళ్లు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ పోలీసులకు చెప్పారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అతడి హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని లేఖలో వెల్లడించారు. కోసాల్ అనే వ్యక్తి అతడి హత్యకు ప్రధాన కారణమని మావోయిస్టులు ఆరోపించారు.
News December 5, 2025
పుతిన్ సంపద ఎంత.. బిల్ గేట్స్ కన్నా ధనవంతుడా?

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో పుతిన్ ఒకరు. ఆయనకు ఏడాదికి రూ.1.25 కోట్ల జీతం వస్తుందని, 800 చ.అ. అపార్ట్మెంట్, ప్లాట్, 3 కార్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ పుతిన్ సంపద $200 బిలియన్లకు పైనే అని ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ గతంలో చెప్పారు. ఇది బిల్ గేట్స్ సంపద ($113B-$128B) కన్నా ఎంతో ఎక్కువ. ఆయనకు విలాసవంతమైన ప్యాలెస్, షిప్, ఎన్నో ఇళ్లు, విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.


