News August 6, 2024
తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి: పవన్ కళ్యాణ్

తమను HYDలో అడ్డుకుంటున్నారని APకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఇచ్చిన వినతిపై డిప్యూటీ CM పవన్ స్పందించారు. ‘AP డ్రైవర్లను HYD విడిచి వెళ్లమనడం భావ్యం కాదు. తోటి డ్రైవర్లకు మానవతా థృక్పధంతో TG డ్రైవర్లు సహకరించాలి. 2వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. TG ప్రభుత్వం స్పందించి, సమస్యను పరిష్కరించాలి’ అని సూచించారు. అటు అమరావతి పనులు మొదలయ్యాయని, ఇక్కడా అవకాశాలు పెరుగుతాయని ఆయన వారికి భరోసా ఇచ్చారు.
Similar News
News January 20, 2026
40 ఏళ్లు వచ్చాయా.. లేఆఫ్స్ ముప్పు!

ఉద్యోగికి 40 ఏళ్లు వచ్చాయంటే కెరీర్లో ముఖ్యమైన దశలో ఉన్నారని అర్థం. వీరి 15 ఏళ్ల అనుభవం, నైపుణ్యంతో కంపెనీకి అసెట్‌గా భావిస్తారు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ లేఆఫ్స్ ఎఫెక్ట్ ఈ ఏజ్ ఉద్యోగులపైనే పడుతోంది. ప్రమోషన్లు ఉండటం లేదు. జాబ్ మారుదామంటే ‘మీరు ఓవర్ క్వాలిఫైడ్. ఫ్రెషర్స్, చురుకైన వారు కావాలి’ అని రిక్రూటర్లు చెబుతున్నారు. తక్కువ జీతాలకు ఫ్రెషర్లు దొరకడం కూడా వీరిని వదిలించుకోవడానికి మరో కారణం.
News January 20, 2026
హరీశ్ రావును విచారించనున్న ఆరుగురు అధికారులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. HYDలోని జూబ్లీహిల్స్ PSలో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ఆరుగురు అధికారుల బృందం ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా హరీశ్ వెంట ఆయన న్యాయవాది రాంచందర్‌రావును లోనికి అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, బాధితులుగా పేర్కొన్న BJP నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను విచారించిన సంగతి తెలిసిందే.
News January 20, 2026
ఇంధన భద్రత దిశగా భారత్ కీలక అడుగు

విదేశీ గడ్డపై భారత్ చమురు వేట ఫలించింది. అబుదాబీలో భారీగా ముడి చమురు నిక్షేపాలు దొరకడం మన ‘ఇంధన భద్రత’ దిశగా కీలక అడుగు. క్రూడాయిల్ కోసం విదేశాలపై ఆధారపడే మనకు అక్కడ సొంతంగా నిక్షేపాలు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రో రిసోర్సెస్ జాయింట్ వెంచర్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయంగా మన దేశ శక్తిని పెంచడమే కాకుండా భవిష్యత్తులో ఇంధన కొరత లేకుండా దేశాన్ని మరింత బలోపేతం చేయనుంది.


