News March 31, 2025

తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణం

image

TG: దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైనట్లు NSO తెలిపింది. రాష్ట్రంలో ఇది 1.3 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కేరళలో అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం (7.3 శాతం) నమోదైనట్లు పేర్కొంది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ (4.9%), కర్ణాటక, బిహార్ (4.5%), జమ్మూ కశ్మీర్ (4.3%)లో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని 12 రాష్ట్రాలు 4 శాతం కంటే దిగువన ద్రవ్యోల్బణం నమోదు చేశాయి.

Similar News

News November 28, 2025

రేపు వరంగల్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆయన భద్రకాళీ, వెయ్యి స్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శిస్తారు. కాజీపేట, అయోధ్యపురంలోని రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కూడా ఆయన సందర్శించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలిపారు.

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

image

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 28, 2025

14 ఏళ్లకే ప్రేమ, జంప్.. ఎందుకిలా?

image

విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు(13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ.10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్స్‌కు అప్పగించారు.