News June 14, 2024

తెలంగాణ ICET ఫలితాలు విడుదల

image

తెలంగాణ ICET ఫలితాలను HYD ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు విడుదల చేశారు. జూన్ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 71,647 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 33,928 మంది పురుషులు కాగా, 37,718 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. 5543 మంది నాన్-లోకల్ కేటగిరీలో అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. WAY2NEWS యాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

Similar News

News November 23, 2025

MHBD జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

image

MHBD, తొర్రూర్ డివిజన్ పరిధిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫేస్-1 ఎన్నికల్లో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, MHBD, నెల్లికుదురు, 2వ విడతలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు, థర్ద్ ఫేస్‌లో డోర్నకల్, గంగారాం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల్లో వెల్లడించారు.

News November 23, 2025

మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉందా?

image

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.

News November 23, 2025

తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

image

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.