News December 15, 2024

రేవంత్ పాలనలో తిరోగమిస్తున్న తెలంగాణ: కేటీఆర్

image

TG: పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని, సీఎం రేవంత్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని KTR విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుంటే వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిలో ఉంటాయని Xలో ఓ <>ఆర్టికల్‌ను<<>> షేర్ చేశారు. పాలన గాలికొదిలేసి కక్ష సాధింపు చర్యలకే సమయం కేటాయిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని మండిపడ్డారు.

Similar News

News January 31, 2026

బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే ఢమాల్

image

అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్న బంగారం ధర 11%, వెండి రేటు 32% తగ్గింది. గురువారం ఔన్స్(28.35gms) బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు $5,595(రూ.5.13L)కి చేరగా శుక్రవారం $4,722(రూ.4.32L)కి తగ్గింది. ఔన్స్ సిల్వర్ గురువారం $121.67(రూ.11,155)గా ఉండగా శుక్రవారం $79.30(రూ.7,270)కి పడిపోయింది. USD బలోపేతం, ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌గా కెవిన్ వార్ష్‌ నామినేట్, అమ్మకాలు పెరిగి కొనుగోళ్లు తగ్గడం వంటివి దీనికి కారణాలు.

News January 31, 2026

T20 WCలో ఇద్దరు స్పిన్నర్లు వద్దు: అశ్విన్

image

T20 WCలో టీమ్ ఇండియా తుది జట్టులో ఇద్దరు మెయిన్ స్పిన్నర్లను ఆడించొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ సూచించారు. ‘ఒక మెయిన్ స్పిన్నర్, ఒక స్పిన్ ఆల్ రౌండర్‌ను ఆడించాలి. ఇద్దరు మెయిన్ స్పిన్నర్ల(కుల్దీప్, వరుణ్)ను ఆడిస్తే బ్యాటింగ్‌లో డెప్త్ ఉండదు. అలాగే వరుణ్‌ను ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయకుండా తెలివిగా వాడాలి. అభిషేక్ తన బౌలింగ్‌పై దృష్టి పెడితే మంచి ఆల్‌రౌండర్ అవుతాడు’ అని తన YT వీడియోలో అభిప్రాయపడ్డారు.

News January 31, 2026

మున్సిపల్ ఎన్నికలు.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

image

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డులకు 22,519 మంది అభ్యర్థుల నుంచి 29,743 నామినేషన్లు వచ్చాయి. పార్టీల వారీగా కాంగ్రెస్ 10,046, BRS 7564, BJP 5462, MIM 576, JSP 342, TDP 32, CPI 277, BSP 324, AAP 51, ఫార్వర్డ్ బ్లాక్ 241 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఉపసంహరణ గడువు FEB 3తో ముగుస్తుంది.