News March 30, 2025

ఈ పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే: మంత్రి ఉత్తమ్

image

TG: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఉచిత సన్న బియ్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పథకం గురించి దేశమంతా చర్చించుకోవాలనే తన నియోజకవర్గంలో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హుజూర్ నగర్‌లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా తెలంగాణే ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని, దీంతో పక్కదారి పడుతోందని పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

image

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.

News October 26, 2025

WC జర్నీ.. RO-KO ఆడే సిరీస్‌లు ఎన్నంటే?

image

AUS సిరీస్‌‌ 3వ వన్డేలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతామన్న సంకేతాలిచ్చారు. అప్పటి వరకు మరో 8 వన్డే సిరీస్‌ల్లో RO-KO షో చూసే అవకాశముంది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌, WI, శ్రీలంకతో స్వదేశంలో, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో ఆయా దేశాల్లో టీమ్‌ఇండియా 3 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. వీటితో పాటు ఆసియా కప్‌‌లోనూ వీరు మెరిసే అవకాశముంది.

News October 26, 2025

తాజా వార్తలు

image

☛ WWC: వర్షం వల్ల భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు అంతరాయం
☛ రేపు 4.15PMకు భారత ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్.. దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలుపై ప్రకటించే ఛాన్స్
☛ కర్నూలు ప్రమాదం: DNA పరీక్షలో 19వ వ్యక్తి మృతదేహం గుర్తింపు.. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు అని అధికారుల ప్రకటన
☛ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ సమాప్తం: మంత్రి తుమ్మల