News March 28, 2025
భూకంపం నుంచి తప్పించుకున్న తెలంగాణ MLA ఫ్యామిలీ

బ్యాంకాక్‌లో భూకంపం నుంచి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. రాజ్ ఠాకూర్ భార్య, కూతురు, అల్లుడు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భారీ భూకంపం ధాటికి అనేక బిల్డింగులు కుప్పకూలాయి. అయితే ఆ ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వారు తిరిగి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు.
Similar News
News March 31, 2025
మాజీ క్రికెటర్‌తో నటి మలైకా డేటింగ్?

శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ సంగక్కరతో నటి మలైకా అరోరా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న గువాహటిలో CSKతో మ్యాచ్ సందర్భంగా ఆమె సంగక్కర పక్కన RR జెర్సీ ధరించి కూర్చున్నారు. ఈ ఫొటో SMలో వైరల్ కాగా, డేటింగ్ రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల హీరో అర్జున్ కపూర్‌కు బ్రేకప్ చెప్పిన ఆమె మాజీ క్రికెటర్‌తో రిలేషన్ స్టార్ట్ చేశారని చర్చించుకుంటున్నారు.
News March 31, 2025
కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి నోటీసులు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి <<15944206>>నోటీసులు<<>> జారీ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ విషయంలో ఇవాళ విచారణకు రావాలని నిన్న నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు. దీంతో రేపు ఉదయం 11గంటలకు విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చారు. రేపు కూడా కాకాణి విచారణకు గైర్హాజరైతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.
News March 31, 2025
CM తలపెట్టిన ‘P4’ గొప్ప ఆలోచన: అనగాని

AP: విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, KG నుంచి PG వరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘DSC ద్వారా 16K టీచర్ పోస్టుల భర్తీ చేయబోతున్నాం. CM తలపెట్టిన P4 కార్యక్రమం గొప్ప ఆలోచన’ అని బాపట్ల జిల్లా పర్యటనలో అన్నారు. ఈ సందర్భంగా రేపల్లెలో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్‌ను ఆయన కోరారు.