News November 18, 2024

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* RRR(రీజనల్ రింగ్ రోడ్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా IAS హరిచందన నియామకం
* RRR దక్షిణ భాగం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకానికి గవర్నమెంట్ అనుమతి
* రూ.4,170 కోట్లతో వరంగల్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణం
* HYDను మించి వరంగల్‌ అభివృద్ధి: కొండా సురేఖ
* లగచర్ల వెళ్తున్న ఈటల, డీకే అరుణను అడ్డగించిన పోలీసులు
* TGలో భూసేకరణ పేరుతో దౌర్జన్యం: ఢిల్లీలో BRS MP సురేశ్ రెడ్డి
* BRS, BJP రెండూ ఒకటే: మహేశ్ గౌడ్

Similar News

News November 2, 2025

నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

image

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News November 2, 2025

ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

image

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.

News November 2, 2025

క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

image

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.