News September 2, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

✒ ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ పదవీ విరమణ.. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి?
✒ ఐసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఈ నెల 5లోపు ఫీజు చెల్లింపు, 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్
✒ రాష్ట్రంలో గత 8 నెలల్లో 181 మంది అవినీతి అధికారుల అరెస్ట్
✒ రాష్ట్ర GST వసూళ్లలో 12% వృద్ధి
✒ నాగారం భూదాన్ భూముల కేసులో రూ.4.80 కోట్ల ఆస్తుల జప్తు
Similar News
News September 2, 2025
BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్

TG: MLC కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు BRS ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
News September 2, 2025
కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?

ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయను ఉంచి పూజిస్తారు. ఈ ఆచారాన్ని కలశ స్థాపన అంటారు. పూజ తర్వాత ఆ కొబ్బరికాయను ఓ వస్త్రంలో చుట్టి ఇంట్లోనే కడుతుంటారు. అలా చేయనివారు దాన్ని పారుతున్న నీటిలో/దగ్గర్లోని జలాశయాల్లో నిమజ్జనం చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు. పీఠంపై ఉంచిన బియ్యంతో పాటు కొబ్బరికాయను కూడా బ్రాహ్మణులకు ఇవ్వొచ్చని అంటున్నారు. బ్రాహ్మణులు ఆ కొబ్బరికాయను ‘పూర్ణాహుతి’కి వాడతారు.
News September 2, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అల్వాల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, జనగాం, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ తెలిపింది.