News September 3, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదించిన 5 బిల్లులు రాజ్‌భవన్‌కు చేరాయి. సలహా కోసం న్యాయ శాఖకు రాజ్‌భవన్ బిల్లులను పంపనుంది.
* రాష్ట్రంలో వరద నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించి సాయం కోరేందుకు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న Dy.CM భట్టి, మంత్రులు
* HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ ఓటర్ల వివరాలను EC ప్రకటించింది. మొత్తం 3,92,669 ఓటర్లు ఉన్నారు. మార్పులు, చేర్పులకు ఈనెల 17 వరకు అవకాశముంది.
Similar News
News September 3, 2025
కూటమి పాలనలో జగన్ ఫొటోతో సర్టిఫికెట్లు!

AP: గుంటూరు బ్రాడీపేటలో దివ్యాంగ సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ప్రభుత్వం మారి ఏడాదైనా సచివాలయం సిబ్బంది జగన్ ఫొటోలతోనే ధ్రువపత్రాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది మీడియాలో వైరల్ కావడంతో పైఅధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని లబ్ధిదారులకు కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. సదరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
News September 3, 2025
చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం లేదు: CM రేవంత్

TG: BRS అనే పాములో కాలకూట విషం ఉందని CM రేవంత్ ధ్వజమెత్తారు. ‘రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలొచ్చి కొట్టుకుంటున్నారు. దోపిడీ సొమ్ము ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు. మంత్రగాడి దగ్గరికి వెళ్లి మీ పంచాయితీ తేల్చుకోండి. BRSను ప్రజలే బొందపెట్టారు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది’ అని అన్నారు.
News September 3, 2025
బ్యాంక్‌లో కొలువు కొట్టేయాలంటే..?

బ్యాంకు ఉద్యోగాలకు ఏడాది పొడవునా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. మరి ఆ జాబ్ కొట్టాలంటే అర్థమెటిక్, రీజనింగ్, ఆంగ్లంలో పట్టు ఉంటే సరిపోదు. పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి. ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రాక్టీస్‌లో గ్యాప్ ఇవ్వొద్దు. వీక్ టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయగలగాలి. మ్యాథ్స్ క్వశ్చన్స్‌కి జవాబులు తేవడం సులువే! కానీ జాబ్ రావాలంటే.. ఫాస్ట్‌గా ఆన్సర్ చేయడం చాలా ముఖ్యం.