News September 21, 2025
తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

* వరంగల్ వేయి స్తంభాల గుడిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి
* ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
* ప్రతి 20kmలకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించండి: మంత్రి దామోదర రాజనర్సింహ
* సొంతూరు చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న జాగృతి చీఫ్ కవిత
Similar News
News September 21, 2025
కత్రినా కైఫ్ బేబీ బంప్.. ఫొటో వైరల్

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బేబీ బంప్‌తో ఆమె ఫొటో షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. కాగా 2021 డిసెంబర్ 9న విక్కీ, కత్రినా రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.
News September 21, 2025
టెన్త్, ఇంటర్‌తో 1,446 ఉద్యోగాలు.. నేటితో ముగియనున్న దరఖాస్తులు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్ స్టాఫ్, లోడర్ ఉద్యోగాల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 1,446 ఉద్యోగాలు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు (18-30 ఏళ్లు) ఇంటర్మీడియట్, లోడర్ పోస్టులకు (20-40 ఏళ్లు) టెన్త్ పాసై ఉండాలి. జీతం నెలకు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుంది. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <
News September 21, 2025
దసరా ఉత్సవాలు: కనకదుర్గమ్మ 11 అలంకారాలు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రేపటి నుంచి OCT 2 వరకు జరగనున్నాయి. 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో దర్శనమివ్వనున్నారు.
*SEP 22:బాలాత్రిపుర సుందరీ దేవి *23:గాయత్రీ దేవి *24:అన్నపూర్ణాదేవి *25:కాత్యాయనీ దేవి *26:మహాలక్ష్మీ దేవి *27:లలితా త్రిపుర సుందరీ దేవి *28:మహాచండీ దేవి *29:సరస్వతీ దేవి *30:దుర్గాదేవి *అక్టోబర్ 1:మహిషాసురమర్దిని దేవి *అక్టోబర్ 2:రాజరాజేశ్వరీ దేవి