News September 22, 2025
ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ నం.1

ఆయిల్ పామ్ సాగులో TG దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది. దీని సాగు పెంచేలా 2021 నుంచి ఐదేళ్లకు గానూ కేంద్రం 9 రాష్ట్రాలకు 3.22 లక్షల హెక్టార్ల లక్ష్యం నిర్దేశించింది. తమకు నిర్దేశించిన 1.25 లక్షల హెక్టార్లలో 78,869 హెక్టార్లు సాగు చేసి TG ముందులో నిలిచింది. AP 67,727 హెక్టార్లు, ఒడిశా 4946, KA 5088 హెక్టార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా లక్ష్యం త్వరలో చేరుకుంటామని TG మంత్రి తుమ్మల తెలిపారు.
Similar News
News September 22, 2025
దసరా తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్?

TG: దసరా తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్‌కు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ తొలివారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<17788984>>డేట్స్<<>> ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ సహా దేశంలోని మరిన్ని నియోజకవర్గాలకు షెడ్యూల్ ప్రకటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈసీకి పూర్తి నివేదిక సమర్పించారు.
News September 22, 2025
వ్యవసాయంలో ఎర పంటల ప్రాధాన్యం

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు (Trap Crop) అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.
News September 22, 2025
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ క్యాబేజీలో సాధారణంగా వచ్చే డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంటను వేసి నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ అలసంద పంటలో ఆవాలు ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.