News October 20, 2024

తెలంగాణ పోలీసులు దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్

image

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్‌కు హాజరుకావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు’ అంటూ ఓ ట్వీట్‌లో కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అన్న హాష్ ట్యాగ్‌లను దానికి జోడించారు.

Similar News

News February 6, 2026

ఇప్పటివరకు U-19 మెన్స్ ప్రపంచకప్ విజేతలు

image

భారత్ అన్ని జట్ల కంటే ఎక్కువగా 6 సార్లు ప్రపంచకప్ సాధించింది.
1988- ఆస్ట్రేలియా, 1998- ఇంగ్లండ్
2000- భారత్, 2002- ఆస్ట్రేలియా
2004- పాకిస్థాన్, 2006- పాకిస్థాన్
2008- భారత్, 2010- ఆస్ట్రేలియా
2012- భారత్, 2014- సౌతాఫ్రికా
2016- వెస్టిండీస్, 2018- భారత్
2020- బంగ్లాదేశ్, 2022- భారత్
2024- ఆస్ట్రేలియా, 2026- భారత్

News February 6, 2026

బంగ్లా ఎన్నికలు: మ్యానిఫెస్టోల్లో ఇండియా, హిందువుల ప్రస్తావన

image

Feb 12న బంగ్లాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని BNP ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో హిందువుల ఆస్తులు, ప్రార్థనా స్థలాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. భారత్‌ను యజమానిలా కాకుండా మిత్రుడిలా చూస్తామని పేర్కొంది. మరోవైపు జమాత్-ఎ-ఇస్లామీ భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపినా హిందువుల రక్షణపై మాత్రం మౌనం వహించింది.

News February 6, 2026

మేం బాధపడలేదు కానీ..: పాక్ కెప్టెన్

image

<<17861491>>ఆసియా కప్‌<<>>లో భారత జట్టు తీరుతో తామేమీ బాధపడలేదని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. కానీ హ్యాండ్‌షేక్, ట్రోఫీ నిరాకరించడం వంటివి జరగకూడదని, ఆటకు మంచిది కాదని చెప్పారు. ‘T20 WCలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ICC టోర్నమెంట్లలో ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే’ అని తెలిపారు. రేపు నెదర్లాండ్స్‌తో పాక్ తొలి మ్యాచ్ ఆడనుంది. 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను <<19024958>>బాయ్‌కాట్<<>> చేస్తున్నట్లు పాక్ ప్రకటించడం తెలిసిందే.