News December 30, 2024

తెలంగాణ పోలీస్ లోగో మార్పు

image

తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ లోగోలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త లోగోను TG పోలీస్ ట్వీట్ చేసింది. గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది. లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు ప్రభుత్వ శాఖలకు ముందు TS స్థానంలో TGగా మార్చిన సంగతి తెలిసిందే.

Similar News

News October 27, 2025

కాస్త రిలీఫ్.. తగ్గిన బంగారం ధరలు

image

బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,050 దిగివచ్చి రూ.1,14,100గా ఉంది. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ రూ.1,70,000గా ఉంది.

News October 27, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్‌టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

News October 27, 2025

ఉపనిషత్తుల గురించి ఇవి మీకు తెలుసా..?

image

భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉపనిషత్తులు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి వేదాల అంత్య భాగాలైనందున వేదాంతాలని అంటారు. ‘ఉపనిషత్’ అంటే గురువు సన్నిధిలో పొందే ఆత్మజ్ఞానం. జగద్గురు ఆది శంకరాచార్యులు 11 ఉపనిషత్తులకు వివరణ రాశారు. నిజమైన సుఖం, ఆనందం కేవలం బయటి వస్తువుల ద్వారా కాక, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుందని ఉపనిషత్తుల సారం బోధిస్తుంది. ఇవి మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తాయి. <<-se>>#VedikVibes<<>>