News February 1, 2025

పన్ను వసూళ్లలో నంబర్‌వన్‌గా తెలంగాణ

image

TG: పన్ను వసూళ్లలో సొంత పన్నుల సొమ్ములు సగానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సొంత పన్ను వసూళ్లు 88 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే జల్ జీవన్ మిషన్‌ను వంద శాతం అమలు చేస్తున్న 8 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నట్లు తెలిపింది. ఐటీ సేవలతో దేశంలో కర్ణాటక, తెలంగాణ ముందున్నాయని పేర్కొంది.

Similar News

News February 1, 2025

బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం

image

2025-26 బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంటు భవనంలో సమావేశమైన క్యాబినెట్ పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఉ.11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మూడో టర్మ్‌లో ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.

News February 1, 2025

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 60% పూర్తి

image

AP: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉ.10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 60% పంపిణీ పూర్తయింది. ఉదయం పింఛన్ల పంపిణీ ప్రారంభించిన కాసేపటికే సర్వర్‌లో సమస్య తలెత్తడంతో కాసేపు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమస్య పరిష్కారం అవడంతో ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్లను అందజేస్తున్నారు. కాసేపట్లో అన్నమయ్య(D) మోటుకట్లలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

News February 1, 2025

కాంగ్రెస్ MLAల రహస్య సమావేశం?

image

TG: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమ పనులు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో వీరు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా టాప్-5లో ఉన్న ఓ మంత్రి వైఖరిపై వారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గాంధీభవన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.