News August 22, 2024

తెలంగాణ స్పోర్ట్స్ లోగో ఆవిష్కరించిన సీఎం

image

TG: స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగోను సచివాలయంలో CM రేవంత్ ఆవిష్కరించారు. ‘జీవితం కోసం క్రీడలు’ అనే ట్యాగ్ లైన్‌తో జ్యోతి వెలుగులు జిమ్ముతున్నట్లుగా లోగోను రూపొందించారు. ఒలింపిక్స్ వంటి ప్రపంచ క్రీడా పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దేలా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేసే ఛాన్సుంది.

Similar News

News March 5, 2026

అప్పుడు తగ్గింది ఇప్పుడు నెగ్గడానికేనా?

image

గతేడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP-JDU కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 సీట్లలో BJP 89, JDU 85 చోట్ల గెలిచాయి. మెజార్టీ స్థానాలు దక్కినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాషాయ పార్టీ నితీశ్‌కే సీఎం పదవి ఇచ్చింది. అయితే BJP అప్పుడు వెనక్కి తగ్గింది ఇప్పుడు సీఎం పదవి చేజిక్కించుకొని, రాష్ట్ర రాజకీయాలను శాసించడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 5, 2026

రాజ్యసభకు వెళ్తున్నా: CM నితీశ్ కుమార్

image

రాష్ట్ర రాజకీయాలను వదిలి రాజ్యసభకు వెళ్తున్నట్లు బిహార్ CM నితీశ్ కుమార్ ప్రకటించారు. ‘రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అందుకే రాజ్యసభకు వెళ్తున్నా. 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా ఉన్న క్యాడర్, ప్రజలకు నా ధన్యవాదాలు. త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు.

News March 5, 2026

నెలకు రూ.40వేల జీతం.. ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

ముంబై పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in