News November 17, 2024
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇకపై తెలంగాణ పోలీస్
TG: రాష్ట్ర పోలీస్ యూనిఫాంలో కీలక మార్పులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు యూనిఫాంలోని బ్యాడ్జీలో తెలంగాణ స్టేట్ పోలీస్(TSP) అనే అక్షరాలు ఉండేవి. ఇకపై తెలంగాణ పోలీస్(TGP)గా మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పోలీసులకు సంబంధించిన TSSP స్థానంలో TGSPతో పాటు TSPSకు బదులు TGPS అనే అక్షరాల బ్యాడ్జీలు వాడాలని ఆదేశించారు.
Similar News
News November 17, 2024
మిస్ యూనివర్స్-2024 రేస్ నుంచి భారత్ ఔట్
మెక్సికోలో జరుగుతున్న మిస్ యూనివర్స్-2024 అందాల పోటీలో భారత్ ప్రస్థానం ముగిసింది. మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా స్విమ్ సూట్ రౌండ్లో ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 30 మంది పాల్గొన్న ఈ రౌండ్ నుంచి 12 మంది మాత్రమే తదుపరి గౌను రౌండ్‌కు ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌కు చెందిన రియా మిస్ యూనివర్స్ ఇండియా-2024 విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికయ్యారు.
News November 17, 2024
ఆవు పేడలో నోట్ల కట్టలు
HYDలోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా సంస్థ లాకర్ నుంచి రూ.20లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఆ డబ్బును ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బాదమందరుని గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అతని అత్తమామలపై ఇంట్లో తనిఖీలు చేశారు. చివరికి ఆవు పేడ కుప్పలో నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News November 17, 2024
అణ్వాయుధాల తయారీ AIకి ఇవ్వొద్దు.. US, చైనా ఒప్పందం
AI ఊహాతీతంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అణ్వాయుధాల తయారీ, నిర్వహణ దాని చేతిలో ఎప్పుడూ పెట్టకూడదని US, చైనా తాజాగా అంగీకరించాయి. పెరూలో జరిగిన APEC సదస్సులో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయిన సందర్భంగా అణ్వాయుధాలను మనుషులు మాత్రమే హ్యాండిల్ చేయాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో AIని బాధ్యతగా వాడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం US వద్ద 5044, చైనా వద్ద 500 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి.