News June 11, 2024

రేపు తెలంగాణ టెట్ ఫలితాలు

image

TG: మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలను రేపు అధికారులు విడుదల చేయనున్నారు. పేపర్-1కి 99,958 మంది, పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ కలిపి 2,36,487 మంది(83 శాతం) హాజరయ్యారు. కాగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

Similar News

News October 28, 2025

బీట్‌రూట్‌తో చిన్నారులకు మేలు

image

పిల్లలు పెరిగే కొద్దీ వారికి అందించే పోషకాలు కూడా పెరగాలి. దానికి బీట్‌రూట్ మంచి ఆప్షన్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఫైబర్‌, ఫోలేట్‌, మాంగనీస్‌, పొటాషియంతో పాటు విటమిన్‌ బి9 ఉండటం వల్ల ఎర్రరక్త కణాల తయారీకి, రక్త ప్రసరణకు తోడ్పడతాయి. పిల్లల్లో మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లల ఆహారంలో దీన్ని చేర్చాలని చెబుతున్నారు.

News October 28, 2025

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఒడిశాకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని గుంటూరు, కృష్ణా, ప.గో, తూ.గో, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంతో పాటు టీజీలోని భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో రేపు ఉదయం లోపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాలకూ అలర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి.

News October 28, 2025

కనీస మద్దతు ధర ₹8110తో పత్తి కొనుగోలు: అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రంలో CCI ద్వారా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపట్నుంచి ఆరంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వీటి ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలన్నారు. 2025-26లో 4.56లక్షల హెక్టర్లలో పత్తిసాగు చేశారని, 8లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. క్వింటాలు పత్తికి నిర్ణయించిన మద్దతు ధర ₹8110ను రైతులకు అందించాలన్నారు. రైతులు కూడా పత్తి అమ్మకాలకు నిబంధనలు పాటించాలని సూచించారు.