News March 30, 2025
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణనే టాప్

TG: పట్టణ తలసరి వ్యయంలో దేశంలోనే TG అగ్రస్థానంలో నిలిచినట్లు కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 తెలిపింది. రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ వ్యయం రూ.4,122 ఉండగా, పట్టణాల్లో రూ.6,199గా ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో గ్రామీణ నెలవారీ వ్యయం రూ.6,611గా ఉంది. పట్టణాల్లో విద్యకు నెలకు రూ.183, అద్దె-661, వైద్యం-రూ.426, మద్యం, పాన్-రూ.320, కూల్ డ్రింక్స్, చిప్స్ కోసం రూ.33 ఖర్చు చేస్తున్నట్లు వివరించింది.
Similar News
News April 1, 2025
ఆ భూములు అటవీ శాఖ పరిధిలోనివి: బండి

TG: కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న ఆ 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు. కేంద్రం ఆమోదం లేకుండా అడవులను నరికివేయడం కుదరదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తుచేశారు. ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో నడుస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఉందని మండిపడ్డారు.
News April 1, 2025
జీబ్లీ ట్రెండ్‌లో ప్రభాస్, తేజా, శేష్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ట్రెండ్ ఫాలో అవడంలో ముందుంటామంటోంది. SMలో వైరలవుతోన్న జీబ్లీ ట్రెండ్‌లో తాము కూడా చేరుతున్నామంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ జీబ్లీ పిక్ ఆకట్టుకుంటోంది. ‘మిరాయ్’లో సూపర్ యోధాగా తేజా సజ్జ, ‘తెలుసుకదా’లో సిద్ధూ & రాశి, ఏజెంట్ 116లో అడివిశేష్ల పోస్టర్లను ఎడిట్ చేసింది. మరి ఈ ట్రెండ్‌లో మీరూ పాల్గొన్నారా? COMMENT
News April 1, 2025
హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

TG: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.