News October 13, 2025
తెలంగాణ అప్డేట్స్

* బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
* జూబ్లీహిల్స్ బై పోల్‌కు నేడు నోటిఫికేషన్
* బూత్‌లకు రాలేకపోయిన చిన్నారులకు ఇవాళ, రేపు ఇంటింటికి వెళ్లి పోలియో డ్రాప్స్ వేయనున్న వైద్య సిబ్బంది
* 2,620 మద్యం దుకాణాలకు 5,663 దరఖాస్తులు.. ఈ నెల 18తో ముగియనున్న గడువు
* గ్రూప్-1 అధికారులుగా నియమితులైన వారిలో 131 మందిని 26 జిల్లాలకు ఎంపీడీవోలుగా నియామకం
Similar News
News October 13, 2025
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 82,229 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 25,209 వద్ద ట్రేడవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News October 13, 2025
నాలుగో రోజు ప్రారంభమైన ఆట

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఫాలో ఆన్ ఆడుతున్న WI 93 పరుగుల వెనుకంజలో ఉంది. నిన్న 35కే రెండు వికెట్లు కోల్పోయినా క్యాంప్‌బెల్(90), హోప్(67) క్రీజులో నిలదొక్కుకొని 138 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం WI స్కోర్ 177/2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
News October 13, 2025
ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో పలువురు అభిమానులను ఆయన కలిశారు. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే తరహాలో ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. పుష్ప సిరీస్‌తో అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.