News July 24, 2024
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఎడారి అవుతుంది: మహేశ్వర్ రెడ్డి

APకి కేంద్రం రూ.15వేలకోట్లు కాకుండా ప్రత్యేక హోదా ఇచ్చుంటే తెలంగాణ ఎడారిగా మారేదని BJP MLA మహేశ్వర రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘APకి డబ్బులు ఇచ్చారనే అక్కసు ఎందుకు? వారికి హోదా ఇచ్చుంటే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయేవి. APకి హోదా ఇవ్వకుండా TGని రక్షించిన మోదీకి పాలాభిషేకం చేయాలి’ అని ఆయన సభలో మాట్లాడారు. అటు కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో చర్చను నిరసిస్తూ BJP సభ్యులు వాకౌట్ చేశారు.
Similar News
News December 9, 2025
PHC స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను PHC స్థాయిలోనే సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు నమోదైనట్లు చెప్పారు. 9 మరణాలూ అనుమానిత కేసులు మాత్రమే అని, లోతైన పరీక్షలకు జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తున్నామన్నారు. కుట్టినట్లు అనిపించిన శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.
News December 9, 2025
చలికాలం కదా అని!

చలికాలంలో చాలామంది నీరు తాగడంపై అశ్రద్ధ వహిస్తారు. అయితే ఈ కాలంలోనూ డీహైడ్రేషన్ ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘డైలీ 6-9 గ్లాసుల నీళ్లు తాగాలి. వాటర్ తాగాలని అనిపించకపోతే సూప్లు, టీలు తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ప్లూయిడ్ అంది జీవక్రియ మెరుగవుతుంది’ అని చెబుతున్నారు. అలాగే శరీరాన్ని స్వెటర్లతో కప్పి ఉంచకుండా సూర్యరశ్మి పడేలా చూసుకుంటే D-విటమిన్ అందుతుందని సూచిస్తున్నారు.
News December 9, 2025
IPL మినీ వేలం.. 350 మందితో ఫైనల్ లిస్ట్

IPL మినీ వేలంలో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి 1,355 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఆ లిస్టును BCCI 350 మందికి కుదించింది. ఈ లిస్టులో తొలుత పేరు నమోదు చేసుకోని 35 మంది కొత్త ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. అతని బేస్ ధర రూ.కోటిగా నిర్ణయించారు. DEC 16న 2.30PMకు అబుదాబి వేదికగా IPL వేలం జరగనుంది.


