News December 1, 2024
ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూలపల్లి మండలం వడ్కాపూర్కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి వరంగల్లోని కాకతీయ వర్సిటీలో లా చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు.
Similar News
News December 1, 2024
టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే
AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.
News December 1, 2024
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
TG: ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఇతరులు ఉన్నట్లు సమాచారం.
News December 1, 2024
రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
ఏపీలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.