News January 2, 2025
ఆఖరి త్రైమాసికంలో తెలంగాణ రూ.30వేల కోట్ల రుణం

TG: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆఖరి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల కోట్ల రుణాన్ని సమీకరించనుంది. ఇప్పటికే సర్కారు వద్ద రూ.10వేల కోట్లుండగా.. ఎఫ్ఆర్బీఎం కింద జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నెలకు రూ.10వేల కోట్ల చొప్పున రుణం తీసుకోనుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసా, సర్పంచుల బిల్లుల చెల్లింపు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
కృష్ణ: వసుధ రైస్ మిల్లుపై ఏసీబీ అధికారులు సోదాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో భారీగా అక్రమస్తులు కూడబెట్టిన అధికారి గుట్టును ఏసీబీ రట్టు చేసింది. రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై నిఘా పెట్టిన అధికారులు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామ శివారులోని వసుధ రైస్ మిల్లులోను ఏసీబీ ఆదికారులు సోదాలు చేశారు. రైస్ మిల్లు కోసం దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
News December 5, 2025
రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


