News March 20, 2025

తెలంగాణ అప్పులు రూ.5.04 లక్షల కోట్లు

image

TG: నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం చివరి (మార్చి 2026) నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు అని వెల్లడించారు. GSDPలో దీని వాటా 28.1% అని తెలిపారు. 2024-25లో తలసరి ఆదాయం రూ.3,79,751 అని, ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,05,579గా ఉందని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2025

వరల్డ్ బెస్ట్ బ్రెడ్ మన ఇండియాదే!

image

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ మార్చి-2025 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారతదేశపు ‘బటర్ గార్లిక్ నాన్’ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రెడ్‌గా నిలిచింది. ఇది 4.7 రేటింగ్‌తో ప్రథమ ర్యాంకును పొందింది. ఆ తర్వాత అమృత్‌సర్‌కు చెందిన ‘కుల్చా’కు రెండు, పరోటాకు ఆరో స్థానం లభించింది. కాగా, 8వ ర్యాంకులో ‘నాన్’, 18లో ‘పరాఠా’, 26లో ‘భతురా’, 28లో ‘ఆలూ నాన్’, 35 ర్యాంకులో ‘రోటీ’ ఉన్నాయి.

News March 20, 2025

రెండో భర్తతో సింగర్ విడాకులు

image

ప్రముఖ సింగర్ సియా ఫర్లర్ తన రెండో భర్త డేనియల్ బెర్నాడ్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత వారిద్దరు వేరుకానున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. విడాకుల కోసం సియా కోర్టును ఆశ్రయించినట్లు పీపుల్ మ్యాగజైన్ పేర్కొంది. ఆమె పాడిన <>చీప్ థ్రిల్స్ ఆల్బమ్<<>> సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. ఓన్లీ సీ, హీలింగ్ డిఫికల్ట్, కలర్ ది స్మాల్ వన్ వంటి ఆల్బమ్స్ సియా ఖాతాలో ఉన్నాయి.

News March 20, 2025

ఈ నెల 29న సూర్య గ్రహణం

image

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.

error: Content is protected !!