News June 15, 2024
‘కాలర్ ఐడీ’పై త్వరలో టెలికం కంపెనీల ట్రయల్స్

ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఫోన్లో డిస్ప్లే అయ్యే కాలర్ ఐడీపై టెలికం కంపెనీలు ట్రయల్స్‌కు సిద్ధమయ్యాయి. ఇటీవల స్పామ్, మోసపూరిత కాల్స్ పెరగడంతో కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదించింది. తొలుత వ్యతిరేకించిన టెలికం కంపెనీలు.. GOVT, TRAI ఒత్తిడితో త్వరలో కొన్ని నగరాల్లో ట్రయల్స్ చేపట్టనున్నాయి. పరిశీలన అనంతరం ఈ సేవలు సాధ్యమా? లేదా? అనే దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి.
Similar News
News January 27, 2026
మాట తప్పడం, మడమ తిప్పడం TDP రక్తంలోనే లేదు: లోకేశ్

AP: పేదరికం లేని సమాజం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. మాట తప్పడం, మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదని చెప్పారు. ‘పార్టీనే అందరికీ అధినాయకత్వం. చంద్రబాబు సేనాధిపతి. మనమంతా ఆయన సైనికులం. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు’ అని తెలిపారు.
News January 27, 2026
వీరు కాఫీ తాగితే ప్రమాదం

రోజూ తగినంత మోతాదులో కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. గర్భవతులు, బాలింతలు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ తాగినా 200 మిల్లీ లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. అలాగే మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News January 27, 2026
మొక్కుబడులు చెల్లించకపోతే చెడు జరుగుతుందా?

మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందని అంతా భయపడతారు. కానీ తల్లికి బిడ్డల మీద కోపం రానట్లే దేవుడు కూడా మొక్కులు తీర్చలేదని కష్టాలు పెట్టడు. ఆయన మన నుంచి కేవలం ధర్మబద్ధమైన జీవనాన్నే కోరుకుంటాడు. మనం చేసే కర్మానుసారమే సుఖదుఃఖాలు కలుగుతాయి. మొక్కులు మరచిపోవడం అనేది మన బలహీనత. దేవుడు ఎప్పుడూ సత్యం, మాట మీద నిలబడమని చెబుతాడు. ఆ నియమాన్ని మీరితే అది మన సమస్యే అవుతుంది.


